దక్షిణాఫ్రికా, భారత్ ల మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది.
సెంచూరియన్: దక్షిణాఫ్రికా, భారత్ ల మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు సత్తా చాటారు. ఓపెనర్ ఆమ్లా(13), డేవిడ్స్ (1), డుమినీ(0) తక్కువ పరుగులకే వెనుదిరిగినా, డి కాక్ (101), డివిలియర్స్ (109) సెంచరీలు చేసి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. చివర్లో మిల్లర్ (56) పరుగులతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కగా, మహ్మద్ షమీ మూడు, ఉమేష్ యాదవ్ వికెట్ తీశారు. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యఛేదనకు ఆటంకం ఏర్పడింది.