
రాహుల్‌కు ఐదు పతకాలు
ఏకకాలంలో జరుగుతున్న ఆసియా కప్, ఆసియా ఇంటర్ క్లబ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు.
న్యూఢిల్లీ: ఏకకాలంలో జరుగుతున్న ఆసియా కప్, ఆసియా ఇంటర్ క్లబ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. ఉత్తర కొరియాలోని ప్యాంగ్‌యాంగ్ నగరంలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 25 పతకాలు (12 రజతాలు, 13 కాంస్యాలు) చేరాయి.
ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సాధించాడు. ఆసియా కప్‌లో రాహుల్ 77 కేజీల విభాగంలో రెండు రజతాలు (స్నాచ్, టోటల్ అంశాల్లో), కాంస్యం (క్లీన్ అండ్ జెర్క్‌లో) నెగ్గాడు. ఆసియా ఇంటర్ క్లబ్ పోటీల్లో ఈ గుంటూరు జిల్లా లిఫ్టర్ రజతం (స్నాచ్‌లో), కాంస్యం (టోటల్ లిఫ్ట్) దక్కించుకున్నాడు.