
ఆమెకు ఏపీలో అంతా 'ప్రత్యేకమే'
ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అపూర్వ స్వాగతం ఏర్పాటు చేశారు.
రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనల కోసం ఉపయోగించే ప్రత్యేక విమానాన్ని సింధు కోసం పంపారు.
ఎప్పుడూ సాధారణ విమానాలు వెళ్లే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కాక.. వీఐపీల కోసం మాత్రమే ఉపయోగించే బేగంపేట విమానాశ్రయం నుంచి.. ఈ ప్రత్యేక విమానంలో పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, కోచ్ గోపీచంద్ అంతా బయల్దేరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వయంగా వాళ్లను తోడ్కొని హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు.