విజయం దిశగా పంజాబ్ | Punjab on verge of thrilling win over Uttar Pradesh | Sakshi
Sakshi News home page

విజయం దిశగా పంజాబ్

Nov 8 2016 10:41 AM | Updated on Sep 4 2017 7:33 PM

ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్‌తో రంజీ మ్యాచ్


హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయానికి కేవలం 51 పరుగుల దూరంలో నిలిచింది. పంజాబ్ చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నారుు. 243/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం తొలిఇన్నింగ్‌‌సను ప్రారంభించిన పంజాబ్‌ను బౌలర్లు అంకిత్ రాజ్‌పుత్ (3/58), ఇంతియాజ్ అహ్మద్ (3/57) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి ఓవర్‌నైట్ స్కోరుకు మరో 76 పరుగులు జోడించి పంజాబ్ ఆలౌటైంది. యువరాజ్ (85), మన్‌దీప్ సింగ్ (63) రాణించారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు 16 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్‌‌స ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్...  38.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ (6/27) చెలరేగి ఉత్తర ప్రదేశ్ వెన్నువిరిచాడు. యూపీ జట్టులోరింకు సింగ్ (43 నాటౌట్) టాప్ స్కోరర్.

 తర్వాత 112 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్‌‌సలో 18 ఓవర్లలో 2 వికెట్లకు 61 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (34), జీవన్ జోత్ సింగ్ (27 నాటౌట్) తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఉదయ్ కౌల్ (0 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement