ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పుణే ఎఫ్‌సీ జట్టు సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది.
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పుణే ఎఫ్‌సీ జట్టు సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. తద్వారా నాకౌట్ దశకు చేరుకునే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. అట్లెటికో డి కోల్‌కతా జట్టుతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణే జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
పుణే తరఫున ఎడువార్డో పెరీరా (41వ నిమిషంలో), అనిబాల్ రోడ్రిగెజ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఇయాన్ హ్యుమె (69వ నిమిషంలో) కోల్‌కతా జట్టుకు ఏకై క గోల్‌ను అందించాడు. ఈ గెలుపుతో పుణే పారుుంట్ల పట్టికలో తొమ్మిది పారుుంట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో గోవా జట్టు తలపడుతుంది.