పంజాబ్‌ హ్యాట్రిక్‌ ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2 | Pro Wrestling League 2017: NCR Punjab Royals claim emphatic win | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ హ్యాట్రిక్‌ ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2

Jan 11 2017 1:47 AM | Updated on Sep 5 2017 12:55 AM

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో పంజాబ్‌ రాయల్స్‌ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూపీ దంగల్‌ జట్టుతో మంగళవారం జరి గిన మ్యాచ్‌లో పంజాబ్‌ రాయల్స్‌ 5–2తో గెలుపొందింది.

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో పంజాబ్‌ రాయల్స్‌ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూపీ దంగల్‌ జట్టుతో మంగళవారం జరి గిన మ్యాచ్‌లో పంజాబ్‌ రాయల్స్‌ 5–2తో గెలుపొందింది. తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఓడిన పంజాబ్‌ ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం విశేషం. తాజా ఫలితంతో పంజాబ్‌ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... జైపూర్‌ నింజాస్, ముంబై మహారథి, హరియాణా హ్యామర్స్‌ జట్లు నాలుగేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. పంజాబ్‌ తరఫున వ్లాదిమిర్‌ (57 కేజీలు) 6–2తో అమిత్‌ దహియాపై, జితేంద్ర (74 కేజీలు) 6–1తో గప్రిండాష్‌విలిపై, ఒడునాయో (53 కేజీలు) 16–0తో పింకీపై, ఇలియాస్‌ బెక్‌బులతోవ్‌ (65 కేజీలు) 6–3తో క్విటావ్‌స్కీపై, మర్జాలియుక్‌ (75 కేజీలు) 3–1తో మమాషుక్‌పై గెలిచారు. యూపీ దంగల్‌ జట్టు నుంచి ఎలిసా యంకోవా (48 కేజీలు) 2–1తో నిర్మలా దేవిపై, అమిత్‌ ధన్‌కర్‌ 13–5తో ప్రవీణ్‌ రాణా పై నెగ్గారు. యూపీ స్టార్‌ ప్లేయర్‌ గీతా ఫోగట్‌ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగకపోవడం గమ నార్హం. బుధవారం హరియాణా హ్యామర్స్‌తో ఢిల్లీ సుల్తాన్స్‌ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement