రెండో రౌండ్‌లో ప్రాంజల | pranjula enters second round of ITF tourney | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో ప్రాంజల

Sep 12 2017 10:38 AM | Updated on Sep 19 2017 4:26 PM

రెండో రౌండ్‌లో ప్రాంజల

రెండో రౌండ్‌లో ప్రాంజల

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది.

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ ప్రాంజల 6–0, 6–0తో పిబాంగ్రుక్‌ నథ్‌పట్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది.

మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 0–6, 0–6తో మి జువామా యు (చైనా) చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌ తొలి రౌండ్‌లో సౌజన్య భవిశెట్టి–రిషిక ద్వయం 3–6, 5–7తో సవాస్‌ది–చనికర్న్‌ సిలాకుల్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది.   

 

Advertisement
 
Advertisement
Advertisement