ప్రాంజల ముందంజ | pranjula enters second round of ITF pro circuit tourney | Sakshi
Sakshi News home page

ప్రాంజల ముందంజ

Sep 19 2017 12:40 PM | Updated on Sep 19 2017 4:46 PM

ప్రాంజల ముందంజ

ప్రాంజల ముందంజ

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల ప్రొ సర్క్యూట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల ప్రొ సర్క్యూట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ప్రాంజల (భారత్‌) 6–1, 6–4తో యొషిటొమి ఐకో (జపాన్‌)పై విజయం సాధించింది.

 

డబుల్స్‌ విభాగంలో మరో తెలుగు అమ్మాయి సౌజన్య భవిశెట్టి జంట క్వార్టర్స్‌కు చేరుకుంది. తొలిరౌండ్‌లో సౌజన్య భవిశెట్టి–రిషిక సుంకర (భారత్‌) ద్వయం 6–7 (3/7), 6–2, 10–8తో చట్‌మనీ జాన్‌కియా–నపావి జాన్‌కియా (థాయ్‌లాండ్‌) జోడీపై నెగ్గింది.


 

Advertisement
 
Advertisement
Advertisement