ఓ ఇంటివాడైన పీయూష్ చావ్లా | Piyush Chawla gets married to long-time friend | Sakshi
Sakshi News home page

ఓ ఇంటివాడైన పీయూష్ చావ్లా

Dec 1 2013 1:26 AM | Updated on Sep 2 2017 1:08 AM

ఓ ఇంటివాడైన పీయూష్ చావ్లా

ఓ ఇంటివాడైన పీయూష్ చావ్లా

భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలైన అనుభూతి చౌహాన్‌ను శుక్రవారం రాత్రి పెళ్లాడాడు.

మొరాదాబాద్: భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలైన అనుభూతి చౌహాన్‌ను శుక్రవారం రాత్రి పెళ్లాడాడు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, క్రికెట్ సహచరులు ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, జ్ఞానేంద్ర పాండే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
 ఎంబీఏ చదివిన అనుభూతి కుటుంబం గతంలో చావ్లా ఇంటి పక్కనే ఉండేది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం పెళ్లికి దారితీసింది. అనుభూతి తండ్రి డాక్టర్ అమర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మీరట్‌లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్, స్థానిక ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినా.. కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement