చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ

 PCB has Countered Ganguly’s Claims That The Asia Cup 2020 stands cancelled - Sakshi

ఇస్లామాబాద్‌: ఆసియా కప్‌ 2020 రద్దయ్యింది అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మీడియా డైరెక్టర్‌ శామ్యూల్‌ హసన్‌ బర్నీ స్పందించారు. ఆ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్‌ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ( ఏసీసీ) అని తెలిపారు. ‘ఇలాంటి ప్రకటనలు కేవలం ఏసీసీ ప్రెసిడెంట్‌ మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యాలు మ్యాచ్‌ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్‌ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. గంగూల్‌ ప్రతి వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారు, ఆయన మాటలకు విలువ లేదు అని అన్నారు. దీనికి సంబంధించి ఏసీసీ ప్రెసిడెంట్‌ నజ్నూల్‌ హసన్‌ మాత్రమే ప్రకటన చేయాలి. మాకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం  షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు’ అని పేర్కొన్నారు. (ఆసియాకప్‌ 2020 వాయిదా : గంగూలీ)

ప్రముఖ ఇంగ్లీష్‌ ఛానెల్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో గంగూలీ ఆసియా కప్‌ 2020 రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు.  ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి  అభ్యంతరం తెలపడంతో మ్యాచ్‌ జరగాల్సిన వేదికను దుబాయ్‌కు మార్చారు. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సి ఉండగా గురువారం (జూలై 9న)  ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.  . (ఐపీఎల్‌ లేకుండా 2020 ముగిసిపోవద్దు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top