ఓవరాల్ చాంపియన్ శివ | overall champion shiva | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంపియన్ శివ

Jan 26 2014 12:22 AM | Updated on Sep 2 2017 3:00 AM

సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జిమ్ సీనియర్ మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ వెయిట్‌లిఫ్టింగ్‌లో శివ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు.

రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జిమ్ సీనియర్ మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ వెయిట్‌లిఫ్టింగ్‌లో శివ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం ఈ  పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అలీంధార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 10 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో సుమారు 100 మంది వెయిట్‌లిఫ్టర్లు ఇందులో పాల్గొన్నారు.
 
 అలాగే మహిళా వెయిట్‌లిఫ్టర్లు కూడా పాల్గొని సత్తా చాటారు. ఇటీవల జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎన్నికైన రాహుల్ దర్శన్  160 కేజీల విభాగంలో పాల్గొన్నాడు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ మాజీ డెరైక్టర్ ఎల్. మోహన్‌రావు, కోచ్ ఉమేష్, లక్ష్మణ్‌యాదవ్, అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్. రవీందర్, ప్రతినిధులు పిల్లి శ్రీనివాసరావు, ఆర్.కె.రెడ్డి, రాంపరేల్, సుందర్, శివ, ప్యాట్రిక్, రామ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement