భారత జట్టులో విభేదాలు లేవు: దాదా | No conflict within Indian team: Ganguly | Sakshi
Sakshi News home page

భారత జట్టులో విభేదాలు లేవు: దాదా

Jun 26 2015 9:46 AM | Updated on Sep 3 2017 4:25 AM

భారత జట్టులో విభేదాలు లేవు: దాదా

భారత జట్టులో విభేదాలు లేవు: దాదా

భారత జట్టులో ఎటువంటి విభేదాలూ లేవని మాజీ కెప్టెన్, బీసీసీఐ సలహా మండలి సభ్యుడు సౌరభ్ గంగూలీ అన్నాడు.

కోల్కతా: భారత జట్టులో ఎటువంటి విభేదాలూ లేవని మాజీ కెప్టెన్, బీసీసీఐ సలహా మండలి సభ్యుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. టీమిండియా ఓటమి చెందినపుడు, స్థాయి మేరకు ఆడనప్పుడు ఇలాంటి వార్తలు వస్తుంటాయని, ఇవి నిజంకాదని చెప్పాడు.

టి-20, వన్డే కెప్టెన్ ధోనీ, టెస్టు కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలున్నాయని, జట్టులో ఆధిపత్య పోరు నడుస్తోందని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో భారత్ ఓటమికి ఇవే కారణాలని కథనాలు  రావడంతో దాదా స్పందించాడు. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. టీమిండియా ఓడిపోవడం బాధాకరమని, అయితే బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడిందని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement