ఢిల్లీ టెస్ట్‌.. బీసీసీఐపై ఎన్జీటీ సీరియస్‌

NGT Serious on BCCI over Delhi Test - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఫిరోజ్‌ షా కోట్ల టెస్ట్‌ నిర్వహణపై దాఖలైన ఓ పిటిషన్‌ పై సోమవారం విచారణ చేపట్టిన ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరంలో మ్యాచ్‌ నిర్వహణ ఏంటని బీసీసీఐని ప్రశ్నించిన ఎన్జీటీ.. తదుపరి విచారణలోపు వివరణ ఇవ్వాలంటూ కోరింది. కాగా, కాలుష్యం కారణంగా ఆడలేకపోతున్నామంటూ ఆదివారం మాస్కులు ధరించిన శ్రీలంక ఆటగాళ్లు మైదానంలోనే నాటకీయ పరిణామాలకు తెరలేపిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తీరును కూడా ప్రభుత్వం ఆక్షేపించింది. కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ప్రశ్నించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top