దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో రోజు గురువారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 177
డునెడిన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో రోజు గురువారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (78 బ్యాటింగ్), జీత్ రావల్ ( 52) అర్ధసెంచరీలతో రాణించారు. అంతకు ముందు 229/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (140), బవుమా (64) ఔటైన తర్వాత సఫారీ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ప్రస్తుతం కివీస్ మరో 131 పరుగులు వెనుకబడి ఉంది.