ఒలింపిక్స్ కు అర్హత సాధించిన యాదవ్ | Narsingh books an Olympic quota place at World C'ship | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్ కు అర్హత సాధించిన యాదవ్

Sep 13 2015 1:15 PM | Updated on Sep 3 2017 9:20 AM

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత్ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు.

లాస్ వెగాస్(అమెరికా): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత్ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. 74 కేజీల ప్రిస్టయిల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి ఇండియాకు పతకం తెచ్చిపెట్టాడు.  ఈ మెగా టోర్నిలో పతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

అంతేకాదు 2016లో రియోలో జరగనున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ప్రతి విభాగంలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారికి ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో పతకం సాధించడం ద్వారా భార త రెజ్లర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement