కొలంబోలో బంగ్లా క్రికెటర్ రికార్డు | Mushfiqur Rahim creates record in test cricket | Sakshi
Sakshi News home page

కొలంబోలో బంగ్లా క్రికెటర్ రికార్డు

Mar 18 2017 3:07 PM | Updated on Sep 5 2017 6:26 AM

కొలంబోలో బంగ్లా క్రికెటర్ రికార్డు

కొలంబోలో బంగ్లా క్రికెటర్ రికార్డు

బంగ్లాదేశ్‌ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు.

ఢాకా: బంగ్లాదేశ్‌ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 100 డిస్మిసల్స్ చేసిన తొలి బంగ్లా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 88 క్యాచ్ అవుట్లు, మరో 12 స్టంప్‌ అవుట్లు ఉన్నాయి. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న కొలంబో టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ముష్ఫికర్ తర్వాత అత్యధిక డిస్మిసల్స్ చేసిన బంగ్లా క్రికెటర్‌గా ఖలీద్ మసూద్ (87) రెండో స్థానంలో ఉన్నాడు.

28 ఏళ్ల ముష్ఫికర్ ఇప్పటి వరకు 54 టెస్టులు ఆడాడు. 2005లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 5 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో కలిపి 3243 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement