శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది.
కొలంబో: శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 12 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా నిలబడ్డారు. మూడో వికెట్ కు వీరిద్దరూ 85 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది.
లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. కోహ్లి 48, రాహుల్ 39 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు. అజింక్య రహానే(4) మరోసారి నిరాశపరిచాడు. వీరిద్దరినీ ప్రసాద్ అవుట్ చేశాడు.