విజయ్, రహానేలకు కెరీర్ బెస్ట్ ర్యాంకులు | Murali Vijay, Ajinkya Rahane get career-best test ranks | Sakshi
Sakshi News home page

విజయ్, రహానేలకు కెరీర్ బెస్ట్ ర్యాంకులు

Dec 31 2013 2:39 PM | Updated on Sep 2 2017 2:09 AM

విజయ్, రహానేలకు కెరీర్ బెస్ట్ ర్యాంకులు

విజయ్, రహానేలకు కెరీర్ బెస్ట్ ర్యాంకులు

భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాలు నిలుపుకున్నారు.

దుబాయ్: భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాలు నిలుపుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో బ్యాటింగ్ విభాగంలో పూజారా ఏడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్లో అశ్విన్ కూడా ఏడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. భారత్ తరపున వీరిద్దరివే అత్యుత్తమ ర్యాంకులు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన మురళీ విజయ్, అజింక్య రహానే ర్యాంకింగ్స్లో పైకి ఎగబాకారు. విజయ్ ఆరు స్థానాలు ముందుకు వచ్చి 38వ ర్యాంకులో నిలిచాడు. రహానే 65 నుంచి 63 స్థానానికి ప్రమోటయ్యాడు. వీరిద్దరికీ కెరీర్ బెస్ట్ ర్యాంకులు కావడం విశేషం. దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు 12వ ర్యాంకులో రిటైరయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement