ముంబై మహారథి శుభారంభం  | The Mumbai maiden is very good | Sakshi
Sakshi News home page

ముంబై మహారథి శుభారంభం 

Jan 10 2018 1:23 AM | Updated on Jan 10 2018 1:23 AM

The Mumbai maiden is very good - Sakshi

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌లో ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో ముంబై మహారథి 5–2తో ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టును ఓడించింది. ముంబై మహారథి తరఫున మహిళల విభాగంలో సీమా (50 కేజీలు), వెస్కాన్‌ సింథియా (76 కేజీలు), సాక్షి మలిక్‌ (62 కేజీలు)... పురుషుల విభాగంలో సతిందర్‌ (125 కేజీలు), రమోనోవ్‌ (65 కేజీలు) విజయం సాధించారు. ఢిల్లీ తరఫున సందీప్‌ తోమర్‌ (57 కేజీలు), అస్లాన్‌ (92 కేజీలు) గెలుపొందారు.

ఢిల్లీ సుల్తాన్స్‌ కెప్టెన్, భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ముంబై జట్టు కెప్టెన్‌ సాక్షి టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టులో క్లిష్టమైన బౌట్‌ను ‘బ్లాక్‌’ చేసే అవకాశం సంపాదించింది. 74 కేజీ విభాగంలో బరిలోకి దిగాల్సిన సుశీల్‌ కుమార్‌ బౌట్‌ను ఆమె బ్లాక్‌ చేసింది. దాంతో అతను పాల్గొనలేకపోయాడు. టాస్‌ ఓడిన సుశీల్‌ మహిళల 57 కేజీల విభాగాన్ని బ్లాక్‌ చేశాడు. దాంతో ఈ రెండు కేటగిరిలలో బౌట్‌లు జరగలేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement