రోహిత్‌ శర్మ రికార్డులు | Mumbai Indians Captain Rohit Sharma Creates Unique Records | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ రికార్డులు

Apr 27 2019 10:06 AM | Updated on Apr 27 2019 3:14 PM

Mumbai Indians Captain Rohit Sharma Creates Unique Records - Sakshi

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్‌లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. సీఎస్‌కేపై 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 7 అర్ధసెంచరీలు బాదాడు. డేవిడ్‌ వార్నర్‌ (6), శిఖర్‌ ధావన్‌(6), కోహ్లి (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకున్న రికార్డును రోహిత్‌ శర్మ సవరించాడు. 17 సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. యూసఫ్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోని (16)లను అధిగమించి టాప్‌కు దూసుకెళ్లాడు. సురేశ్‌ రైనా 14 సార్లు,  గౌతమ్‌ గంభీర్‌ 13 సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అందుకున్నారు. విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే 12 సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ దక్కించుకున్నారు.

లక్కీ చెపాక్‌..!
చెపాక్‌ స్టేడియం రోహిత్‌ శర్మకు కలిసొచ్చింది. ఈ మైదానంలో అతడు బరిలోకి దిగిన ఆరు సార్లు విజయాన్ని అందుకున్నాడు. డెక్కన్‌ చార్జర్స్‌ తరపున రెండు సార్లు(2008, 2010), ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా (2012, 2013), కెప్టెన్‌గా (2015, 2019) నాలుగు పర్యాయాలు గెలుపు దక్కించుకున్నాడు. నిన్న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చేసిన అర్థసెంచరీ చెపాక్‌లో రోహిత్‌కు మొదటిది కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement