పంత్‌పై ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

MSK Prasad Interesting Comments On Rishabh Pant - Sakshi

ముంబై: వరుస వైఫల్యాలతో సతమవుతున్న టీమిండియా యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో కాస్త ఉపశమనం లభించింది.  చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో రెచ్చి పోయిన పంత్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. విశాఖ వన్డేలో ధాటిగా టీమిండియాకు మంచి స్కోర్‌ అందించాడు. అయితే చివరి వన్డేలో మాత్రం ఘోరంగా నిరుత్సాహపరిచాడు. అయితే ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో పర్వాలేదనిపించిన చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కేవలం పంత్‌ బ్యాటింగ్‌ లోపాలపై మాట్లాడే ఎమ్మెస్కే ప్రసాద్‌ తాజాగా అతడి కీపింగ్‌పై కూడా పెదవివిరిచాడు. 

కీపింగ్‌లో పంత్‌ మరింత మెరుగుపడాలని సూచించాడు. ఈ క్రమంలో స్పెషలిస్టు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌ పర్యవేక్షణలో పంత్‌కు ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ పర్యటనలలో పంత్‌ కీపింగ్‌లో అంతగా ఆకట్టుకోలదని పేర్కొన్నాడు. అయితే అంతగా ఆందోళనచెందాల్సిన అవసరం లేదన్నాడు. పంత్‌ కీపింగ్‌ నుంచి తాము హై లెవల్‌ స్టాండర్డ్స్‌ ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇందుకోసమే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్‌లో పంత్‌ కాస్త మెరుగుపడినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి వన్డేలో కష్టకాలంలో ఉన్న టీమిండియాను శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి పంత్‌ ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. 

ఇక శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌ల కోసం టీమిండియాను ప్రకటించిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌ మీడియా సమావేశంలో పై విధంగా మాట్లాడాడు. అంతేకాకుండా దీపక్‌ చాహర్‌ గాయంపై కూడా చీఫ్‌ సెలక్టర్‌ స్పందించాడు. చాహర్‌ గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. చాహర్‌కు సుదీర్ఘ విశ్రాంతి అవసరమని తెలిపాడు. దీంతో చాహర్‌ను ఐపీఎల్‌ తర్వాతనే సెలక్షణ్‌ కోసం పరిగణలోకి తీసుకుంటామన్నాడు. అయితే బౌలర్ల గాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నాడు. యువ బౌలర్లతో రిజర్వ్‌బెంచ్‌ బలంగా ఉందన్నాడు.  

చదవండి: 
పంత్‌కు పూనకం వచ్చింది..
అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top