ధనాధన్‌ ధోని.. రికార్డులు

MS Dhoni Scripts Twin IPL Records - Sakshi

బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పలు ఘనతలు సాధించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహి నిలిచాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ధోని 42.03 సగటుతో 4330 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధసెంచరీలు ఉన్నాయి.

అంతేకాదు ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బాట్స్‌మన్‌గా కూడా ‘మిస్టర్‌ కూల్‌’ రికార్డు కెక్కాడు. 203 సిక్సర్లలో మూడో స్థానానికి చేరాడు. క్రిస్‌ గేల్‌(323), ఏబీ డివిలియర్స్‌(204) అతడి కంటే ముందున్నారు. రోహిత్‌ శర్మ(190), సురేశ్‌ రైనా(190), విరాట్‌ కోహ్లి(186) కూడా ధోనికి దగ్గరలో ఉన్నారు. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(84)ను ధోని మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. (చదవండి.. ధోని మమ్మల్ని భయపెట్టాడు: కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top