ఆ బంతి ఎందుకు తీసుకున్నానంటే... 

MS Dhoni reveals why he took the ball  - Sakshi

కొన్నాళ్ల క్రితం ఇంగ్లండ్‌ చేతిలో మూడో వన్డేలో పరాజయం అనంతరం అంపైర్ల నుంచి తాను బంతి తీసుకున్న సంఘటనపై మొదటిసారి ధోని నోరు విప్పాడు. ‘మన బౌలర్లు ఎందుకు తగినంత రివర్స్‌ స్వింగ్‌ రాబట్టలేకపోతున్నారో చూసేందుకు ఆ బంతిని తీసుకున్నాను.

ఎందుకంటే వచ్చే ఏడాది మనం ఇంగ్లండ్‌లోనే ప్రపంచ కప్‌ ఆడబోతున్నాం. మనం కచ్చితంగా రివర్స్‌ స్వింగ్‌ రాబట్టే స్థితిలో ఉండాలి. ఇది అక్కడ ఎంతో కీలకం. ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి    ఇప్పటికే ఎంతో సాధించాడని... అతను దిగ్గజం అనిపించుకునేందుకు మరింత చేరువయ్యాడని’ ధోని వ్యాఖ్యానించాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top