డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

Most DRS referrals overturned in CWC19 - Sakshi

లండన్‌: ప్రపంచ క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌(అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి)ని ప్రవేశపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లే అయ్యింది. ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు నేటికీ ఉన్నప్పటికీ దీని వల్ల క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయనే చెప్పాలి. డీఆర్‌ఎస్‌లో హాక్‌ ఐ (బాల్‌ ట్రాకింట్‌ టెక్నాలజీ), హాట్‌ స్పాట్‌(బ్యాట్‌కు బంతి ఎడ్జ్‌ తీసుకుందా అనే కోణాన్ని పరిశీలించడం), స్నికో మీటర్(బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా గుర్తించడానికి వాడే టెక్నాలజీ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో అసలు క్రికెటర్‌ ఔటా, కాదా అనే విషయంపై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్‌కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది.

వన్డే ఫార్మాట్‌లో ఒక జట్టు తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన క్రమంలో ఒక రివ్యూనే ఉంటుంది. దాన్ని ఎక్కడ, ఎలా వాడుకోవాలనేది అక్కడ ఉండే పరిస్థితిపైనే ఉంటుంది. ఒకసారి రివ్యూకు కోల్పోతే మళ్లీ చాన్స్‌ ఉండదు. అదే సమయంలో రివ్యూకు సక్సెస్‌ అయితే అది అలానే ఉంటుంది. మరొకవైపు థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేసిన క్రమంలో కూడా రివ్యూకు వెళ్లిన జట్టు దాన్ని నిలబెట్టుకుంటుంది.  

కాగా, ఆదివారంతో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో డీఆర్‌ఎస్‌ది కూడా ప్రముఖ పాత్రనే చెప్పాలి. నిజంగా డీఆర్‌ఎస్‌ లేకుంటే మెగా టోర్నీ కూడా పేలవంగా ముగిసే అవకాశంతో పాటు ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసేది. ఈ వరల్డ్‌కప్‌లో ఫీల్డ్‌ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇలా అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్‌ అలన్‌ కెటల్‌బారో(ఇంగ్లండ్‌ అంపైర్‌) మొదటి స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్‌కప్‌లో రిచర్డ్‌ అలన్‌ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలగా, ఆ తర్వాత వరుసలో క్రిస్టోఫర్‌ గాఫనీ(న్యూజిలాండ్‌ అంపైర్‌), పాల్‌ విల్సన్‌(ఆస్ట్రేలియా అంపైర్‌),  రుచిర పలియాగురుజే( శ్రీలంక అంపైర్‌), కుమార ధర్మసేన(శ్రీలంక అంపైర్‌)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో నాలుగు అంపైరింగ్‌ తప్పిదాలు చేశారు. 

ఆసీస్‌తో సెమీస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఇలానే బలైపోయాడు. కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్‌ పెవిలియన్‌ వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు రివ్యూ లేకపోవడంతో రాయ్‌ ఇక చేసేదేమీ లేకపోయింది.  ఇదొక ఉదాహరణే అయినా, ఇంకా ఇటువంటివి చాలనే ఉన్నాయి. డీఆర్‌ఎస్‌ విధానం ఉండగానే ఇన్ని తప్పిదాలు జరిగితే.. అసలు అంపైర్‌ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి లేకుంటే మాత్రం అధిక సంఖ్యలో ఆటగాళ్లు కచ్చితంగా ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయాలకు బలైపోయేవారనేది కాదనలేని సత్యం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

15-07-2019
Jul 15, 2019, 10:51 IST
లండన్‌: న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్‌...
15-07-2019
Jul 15, 2019, 09:47 IST
లండన్‌‌: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనీని రనౌట్‌ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్‌ గతినే...
15-07-2019
Jul 15, 2019, 09:35 IST
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో విశ్వ విజేత ఎవరో తేలిపోయింది. లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్‌తో అత్యంత...
15-07-2019
Jul 15, 2019, 09:29 IST
లండన్‌ : వరల్డ్‌కప్‌ 2019 ఫైనల్‌ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఒక అత్యద్భుత పోరు. ప్రపంచకప్‌ ఫైనల్‌ టై కావడమే...
15-07-2019
Jul 15, 2019, 09:00 IST
లండన్‌ : నరాలు తెగే ఉత్కంఠత మధ్య.. క్రికెట్‌ పుట్టినింటికే ప్రపంచకప్‌ చేరింది. మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ టైగా మారినప్పటికి.....
15-07-2019
Jul 15, 2019, 08:44 IST
క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్‌...
15-07-2019
Jul 15, 2019, 08:18 IST
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను...
15-07-2019
Jul 15, 2019, 04:51 IST
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్‌ ఫైనల్లో పాత రూల్స్‌ అమల్లో ఉంటే ఇంగ్లండ్‌–న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. కానీ ఈ మ్యాచ్‌లో...
15-07-2019
Jul 15, 2019, 04:36 IST
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్‌ అద్భుతమైన వన్డే క్రికెట్‌ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి....
15-07-2019
Jul 15, 2019, 04:24 IST
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్‌ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై...
15-07-2019
Jul 15, 2019, 00:31 IST
కొత్త చాంపియన్‌గా అవతరించిన ఇంగ్లండ్‌
15-07-2019
Jul 15, 2019, 00:01 IST
లండన్‌ : నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరికి ఇంగ్లండ్‌నే విజయం వరించింది. తొలుత స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ టై...
14-07-2019
Jul 14, 2019, 20:42 IST
లండన్‌: న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో తొలి పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు...
14-07-2019
Jul 14, 2019, 19:24 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా  ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుది పోరులో న్యూజిలాండ్‌ 242 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  హెన్రీ...
14-07-2019
Jul 14, 2019, 17:04 IST
లండన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు...
14-07-2019
Jul 14, 2019, 16:37 IST
న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని ఇప్పటికే...
14-07-2019
Jul 14, 2019, 15:33 IST
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్‌లోనే ముగించడంపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పెదవి విప్పాడు. భారత...
14-07-2019
Jul 14, 2019, 14:33 IST
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో టీమిండియాను విజయం అంచున నిలబెట్టాడు. ...
14-07-2019
Jul 14, 2019, 10:14 IST
మా అమ్మ బుమ్రా బౌలింగ్‌ శైలిని అనుకరించారు
14-07-2019
Jul 14, 2019, 05:30 IST
ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్‌లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top