'ఓసారి షమీ సూసైడ్‌కు యత్నించాడు' | Mohammed Shamis wife reveals shocking instance when cricketer tried committing suicide | Sakshi
Sakshi News home page

'ఓసారి షమీ సూసైడ్‌కు యత్నించాడు'

Mar 8 2018 6:17 PM | Updated on Mar 8 2018 6:23 PM

Mohammed Shamis wife reveals shocking instance when cricketer tried committing suicide - Sakshi

న్యూఢిల్లీ: ఒకానొక సందర్బంలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని అతని భార్య హసీన్‌ జహాన్‌ తాజాగా వెలుగులోకి తెచ్చారు. అదొ​క షాకింగ్‌ ఘటనగా పేర్కొన్న జహాన్‌..ఒక అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లి వద్దన్నందుకే షమీ అలా చేశాడని ఆమె పేర్కొన్నారు. షమీకి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని తెలిపిన ఆమె బుధవారం సాయంత్రం కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షమీకి సంబంధించిన విషయాల్ని జహాన్‌ బయటపెట్టారు.


'మేమిద్దరం 2012లో తొలిసారి కలుసుకున్నాం. అంతకుముందు షమి సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో ఐదు సంవత్సరాల ప్రేమాయణాన్ని షమీ సాగించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షమి ఆత్మహత్యకు యత్నించాడు' అని జహాన్‌ తెలిపారు.

'షమి కోసం నేను అన్ని చేశా. నా మోడలింగ్‌ కెరీర్, ఉద్యోగం వదులుకున్నా. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు' అని జహాన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement