అజ్ఞాతంలోకి మహ్మద్‌ షమీ! | Mohammed Shami Reportedly Goes Missing After Wife Files Domestic Violence Complaint | Sakshi
Sakshi News home page

Mar 10 2018 1:42 PM | Updated on Mar 10 2018 3:23 PM

Mohammed Shami Reportedly Goes Missing After Wife Files Domestic Violence Complaint - Sakshi

మహ్మద్‌ షమీ

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని భార్య హాసిన్‌ జహాన్‌ షమీ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని,  చంపడానికి ప్రయత్నించాడని, మానసికంగా ఎంతో వేధించినట్లు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు గృహహింస, అత్యాచారం, హత్యాయత్నం కింద్ర షమీ, అతని కుటుంబ సభ్యులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. 

అయితే కేసు నమోదు అనంతరం ఈ స్టార్‌ క్రికెటర్‌ అందుబాటులో లేకుండా పోయాడు.  షమీ తన మొబైల్‌ ఫోన్‌ స్విచ్చ్‌ ఆఫ్‌ చేసుకోని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని మొబైల్‌ లోకెషన్‌ ప్రకారం చివరి సారిగా ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి అతని సోదరుడితో ఘజియాబాద్‌ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో కొందరు కోల్‌కతాలోని తన భార్య కుటింబీకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షమీ మాత్రం మీడియాకు దూరంగా ఉండమని తన కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షమీ, అతని సోదరుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement