షమీకి మరో షాకిచ్చిన భార్య

Mohammed Shami In Alleged Dowry Case Chargesheet Filed - Sakshi

కోల్‌కతా: టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీకి ప్రపంచకప్‌, ఐపీఎల్‌కు ముందు ఊహించని షాక్‌ తగిలింది. గతేడాది ఐపీఎల్‌కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్‌ జహాన్‌ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ప్రపంచకప్‌, ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. (మహ్మద్‌ షమీ భావోద్వేగం..)   

ఇక మహ్మద్‌ షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్‌ జహాన్‌ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హసీన్‌ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ దర్యాప్తు చేసి క్లీన్‌ ఛీట్‌ ఇచ్చింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నవిషయం తెలిసిందే. 

    
(‘మరో పెళ్లి చేసుకోవడానికి పిచ్చోడినా’)
జహాన్‌.. ఐ మిస్‌ యూ: షమీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top