రాయనిక్ సంచలన విజయం | Milos Raonic Stuns Stanislas Wawrinka in Australian Open | Sakshi
Sakshi News home page

రాయనిక్ సంచలన విజయం

Jan 25 2016 4:03 PM | Updated on Sep 3 2017 4:18 PM

రాయనిక్ సంచలన విజయం

రాయనిక్ సంచలన విజయం

ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ప్రపంచ నాల్గో ర్యాంక్ ఆటగాడు, స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా నిష్క్రమించాడు.

మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ప్రపంచ నాల్గో ర్యాంక్ ఆటగాడు, స్విస్ స్టార్  స్టానిస్లాస్ వావ్రింకా నిష్క్రమించాడు.  ప్రి క్వార్టర్స్ ఫైనల్లో భాగంగా సోమవారం మిలాస్ రాయనిక్(కెనడా)తో జరిగిన పోరులో వావ్రింకా ఓటమి పాలయ్యాడు.  రాయనిక్ 6-4, 6-3, 5-7, 7-4, 6,3 తేడాతో వావ్రింకాను మట్టికరిపించి క్వార్టర్స్ కు చేరాడు.

 

గతంలో వీరిద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ లో తలపడిన నాలుగుసార్లు వావ్రింకానే విజయం సాధించగా, ఈసారి మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రాయనిక్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు.  మూడు గంటల 44 నిమిషాల పాటు జరిగిన పోరులో  24 ఏస్ లను సంధించిన రాయనిక్.. వావ్రింకాకు చుక్కలు చూపించాడు. దీంతో 2014 ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇప్పటివరకూ కనీసం క్వార్టర్స్ ఫైనల్ కు చేరిన వావ్రింకా విజయాలకు బ్రేక్ పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement