సచిన్‌ కంటే కోహ్లినే గొప్పోడు: మాజీ క్రికెటర్‌

Michael Vaughan Says Virat Kohli Better Than Sachin Tendulkar - Sakshi

హైదరాబాద్‌: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే ప్రసుత టీమిండియా సారథి విరాట్‌ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడని ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే కోహ్లి అత్యుత్తమ ఆటగాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా పరుగుల యంత్రం తన మైమరిపించే ఆటతో అనేక కొత్త రికార్డులను కొల్లగొడుతున్నాడని వాన్‌ ప్రశంసలు జల్లు కురిపించాడు. దీంతో వన్డేల్లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు ఆగ్రస్థానంలో ఉన్న సచిన్‌, బ్రియన్ లారాలను కోహ్లి వెనక్కి నెట్టాడని వివరించాడు. ప్రస్తుతం మైకేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. గత కొద్ది నెలలుగా కోహ్లి, సచిన్‌లలో ఎవరు గొప్ప అనే అంశం అటు అభిమానుల్లో ఇటు క్రికెట్‌ పండితుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
 ఇక శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి తన 41వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. అయితే కోహ్లి శతకం టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ఈ సిరీస్‌లో కోహ్లికిది రెండో సెంచరీ.. నాగ్‌పూర్‌ వన్డేలో కూడా శతకం నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.  ప్రస్తుతం కోహ్లి ఫామ్‌ను చూస్తే వన్డేల్లో సచిన్‌(49) అత్యధిక సెంచరీల రికార్డును త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఆగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.   

విరాట్‌ కోహ్లి మరో రికార్డు

ఇక చాలు.. మళ్లీ చూడదల్చుకోలేదు : కోహ్లి

టీ20 చరిత్రలో ఇంత ఘోర ఓటమా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top