మెదక్‌ జట్లకు టైటిల్స్‌ | Medak Teams Won Softball Championship | Sakshi
Sakshi News home page

మెదక్‌ జట్లకు టైటిల్స్‌

Jan 14 2019 10:08 AM | Updated on Jan 14 2019 10:08 AM

Medak Teams Won Softball Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో మెదక్‌ జట్లు సత్తా చాటాయి. వరంగల్‌ జిల్లా గీసుకొండలో జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో మెదక్‌ 4–3తో నిజామాబాద్‌పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కామారెడ్డి 7–0తో మహబూబ్‌నగర్‌పై ఘనవిజయం సాధించింది.

బాలుర టైటిల్‌ పోరులో మెదక్‌ 6–5తో వరంగల్‌పై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. మహబూబ్‌నగర్‌ 8–0తో రంగారెడ్డిని ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ సంఘం చైర్మన్‌ పి. సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ సంఘం కార్యదర్శి కె. శోభన్‌బాబు, కోశాధికారి డి. అభిషేక్‌ గౌడ్, వరంగల్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు వి. రాజ్‌ కుమార్, డీవైఎస్‌ఓ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement