మరో మెగా ఫైట్కు మేవెదర్ రెఢీ! | mayweather ready to another big fight | Sakshi
Sakshi News home page

మరో మెగా ఫైట్కు మేవెదర్ రెఢీ!

May 23 2017 11:59 AM | Updated on Sep 5 2017 11:49 AM

మరో మెగా ఫైట్కు మేవెదర్ రెఢీ!

మరో మెగా ఫైట్కు మేవెదర్ రెఢీ!

అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ గురించి బాక్సింగ్ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

వాషింగ్టన్:అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ గురించి బాక్సింగ్ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  మేవేదర్ రింగ్ లో దిగాడంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఓటమి చూడని ధీరుడు. తన కెరీర్ లో 49సార్లు పడితే అన్నింటిలోనూ మేవెదర్దే విజయం. అందులో 26 నాకౌట్లు. 2015లో జరిగిన మెగా ఫైట్ లో  ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోను మట్టికరిపించి 18 కోట్ల డాలర్లు (రూ. 1147 కోట్లు)ను తన ఖాతాలో వేసుకున్న ఆల్ టైమ్ గ్రేట్. 

 

అయితే ప్రస్తుతం మరో పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు మేవెదర్. గత మే నెలలో అతడి 50వ గేమ్ ఉంటుందని భావించిన అది జరగలేదు. తాజాగా అతని పునరాగమనంపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కెరీర్ కు గుడ్ బై చెప్పిన మేవెదర్ మళ్ల్లీ బరిలోకి దిగే యోచనలో ఉన్నాడు.ఈ మేరకు తన తదుపరి పోరు గ్రెగర్‌తో కానీ బదౌవ్ జాక్ లతో ఉండవచ్చనే మేవెదర్ స్సష్టం చేశాడు. ఇక్కడ మెక్ గ్రెగర్ మాత్రమే మేవెదర్ తో పోటీని ధృవీకరించాడు. ఇప్పటికే మా ఇద్దరి పోరుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వెల్లడించాడు. ఈ పోరు ఖరీదు సుమారు రూ. 700 కోట్లు ఉంటుందని అంచనా. మరి ఆ మెగా ఫైట్ ఎప్పుడో అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement