మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

Matt Henry Most Wickets in Power Play in The World Cup - Sakshi

లండన్‌: న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో తొలి పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హెన్రీ మొదటి పవర్‌ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించాడు.  వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో భాగంగా జేసన్‌ రాయ్‌ వికెట్‌ను సాధించడం​ ద్వారా హెన్రీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్‌ నాల్గో బంతికి రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు.  ఈ జాబితాలో కాట్రెల్‌(వెస్టిండీస్‌), జోఫ్రా ఆర్చర్‌( ఇంగ్లండ్‌), క్రిస్‌ వోక్స్‌( ఇంగ్లండ్‌)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ( ఇక్కడ చదవండి: కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు)

కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరంభం నుంచి కివీస్‌ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడిన రాయ్‌.. హెన్రీకి చిక్కాడు. ఆపై జానీ బెయిర్‌ స్టోకు లైఫ్‌ లభించింది. బెయిర్‌ స్టో ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను  గ్రాండ్‌ హోమ్‌ వదిలేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top