
కోల్‌కతా: అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా, భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మారడోనా ఆడలేదు. దీంతో ఆయన వీరాభిమాని అయిన గంగూలీ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘డీగో వర్సెస్ దాదా’ ఎగ్జిబిషన్ మ్యాచ్ కొన్నాళ్ల నుంచి కోల్‌కతా వాసుల్ని ఊరిస్తూ వచ్చింది.
అర్జెంటీనా స్టార్ భారత్ రాక వాయిదా పడటంతో మ్యాచ్ జరగలేదు. ఎట్టకేలకు మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం డీగో ఇక్కడికి వచ్చారు. అయితే మంగళవారం మ్యాచ్‌కు ముందు స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొనడంతో మారడోనా తీవ్రంగా అలసిపోయారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్ల కరచాలనం ముగిసిన వెంటనే ఆయన వెనుదిరిగారు.