మనుశ్‌–రేగన్‌లకు కాంస్యం 

 Manush Shah Raegan Albuquerque clinch mixed team bronze at Belgium Junior Open - Sakshi

స్పా (బెల్జియం): అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) జూనియర్‌ సర్క్యూట్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ జూనియర్‌ బాలుర ఈవెంట్‌లో మనుశ్‌ షా–రేగన్‌ అల్బుక్యూర్‌క్యూ (భారత్‌)లకు కాంస్య పతకం లభించింది. అమీన్‌ అహ్మదియన్‌–రాదిన్‌ ఖయ్యమ్‌ (ఇరాన్‌)లతో కలిసి మనుశ్‌–రేగన్‌ బరిలోకి దిగారు. సెమీఫైనల్లో భారత్‌–ఇరాన్‌ జట్టు 0–3తో జపాన్‌–న్యూజిలాండ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో అమీన్‌ 1–3తో యోషియామ (జపాన్‌) చేతిలో... రెండో సింగిల్స్‌లో మనుశ్‌ 2–3తో కషివా (జపాన్‌) చేతిలో... మూడో సింగిల్స్‌లో రాడిన్‌ ఖయ్యమ్‌ 0–3తో నాథన్‌ జు (న్యూజిలాండ్‌) చేతిలో ఓడిపోయారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top