కుజ్నెత్సోవాదే టైటిల్ | Kuznetsova retains Moscow title to claim last WTA Finals berth | Sakshi
Sakshi News home page

కుజ్నెత్సోవాదే టైటిల్

Oct 23 2016 3:32 PM | Updated on Sep 4 2017 6:06 PM

కుజ్నెత్సోవాదే టైటిల్

కుజ్నెత్సోవాదే టైటిల్

మాస్కోలో జరిగిన క్రెమ్లిన్ కప్ టైటిల్ను రష్యా టెన్నిస్ క్రీడాకారిణి కుజ్నెత్సోవా నిలబెట్టుకుంది.

సింగపూర్:మాస్కోలో జరిగిన క్రెమ్లిన్ కప్ టైటిల్ను రష్యా టెన్నిస్ క్రీడాకారిణి కుజ్నెత్సోవా నిలబెట్టుకుంది. శనివారం జరిగిన తుది పోరులో కుజ్నెత్సోవా 6-2, 6-2 తేడాతో డారియా గావ్రిలివో(ఆస్ట్రేలియా)పై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కుజ్నెత్సోవా ఆద్యంతం ఆకట్టుకుంది. గంట 13 నిమిషాలపాటు జరిగిన పోరులో కుజ్నెత్సోవాకు తిరుగేలేకుండా పోయింది. ఈ టైటిల్ సాధించడంతో కుజ్నెత్సోవా సీజన్ ముగింపు టోర్నీ డబ్యూటీఏ ఫైనల్స్కు అర్హత సాధించింది.


ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో టాప్-8లో ఉన్న వాళ్లు  మాత్రమే డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో ఆడతారు. అయితే గాయం కారణంగా అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), సిమోనా హలెప్ (రొమేనియా), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెయిన), మాడిసన్ కీస్ (అమెరికా), సిబుల్కోవా (స్లొవేకియా) అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement