కొరియా హ్యాట్రిక్ | Korea's hat-trick | Sakshi
Sakshi News home page

కొరియా హ్యాట్రిక్

Oct 14 2016 12:24 AM | Updated on Sep 4 2017 5:05 PM

ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దక్షిణ కొరియా అదరగొడుతోంది.

అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దక్షిణ కొరియా అదరగొడుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 35-32 తేడాతో నెగ్గింది. దీంతో వరుసగా మూడు విజయాలతో పారుుంట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

జంగ్ కున్ లీ మరోసారి మెరుగ్గా ఆడి 14 రైడ్ పారుుంట్లతో జట్టును గెలిపించాడు. చివరి నాలుగు నిమిషాల వరకు బంగ్లా 27-24తో ఆధిక్యంలోనే ఉన్నా లీ మెరుపు ఆటతో కొరియా పుంజుకుంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 53-21తో కెన్యాపై గెలిచింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement