ఐపీఎల్-7 ఫైనల్: బ్యాటింగ్కు దిగిన పంజాబ్ | Kolkata opt to bowl against Punjab in the IPL final | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7 ఫైనల్: బ్యాటింగ్కు దిగిన పంజాబ్

Jun 1 2014 8:01 PM | Updated on Sep 2 2017 8:10 AM

అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ -7 గ్రాండ్ ఫైనల్ ఆరంభమైంది

బెంగళూరు: అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ -7 గ్రాండ్ ఫైనల్ ఆరంభమైంది. ఆదివారం రాత్రి  కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్కు ఇక్కడి చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ ఓపెనర్లు సెహ్వాగ్, మనన్ వోహ్రా బ్యాటింగ్కు దిగారు.

పంజాబ్ బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్ సూపర్ ఫామ్లో ఉండగా, విధ్వంసక వీరుడు సెహ్వాగ్ కూడా జత కలిశాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తూ భారీ స్కోర్లు సాధిస్తున్న పంజాబ్పై అంచనాలున్నాయి. ఐపీఎల్లో పంజాబ్ ఫైనల్ చేరడమిదే తొలిసారి కాగా.. కోల్కతా రెండేళ్ల క్రింత టైటిల్ నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement