నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాలాజీ | Knight Riders bowling coach Balaji | Sakshi
Sakshi News home page

నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాలాజీ

Jan 4 2017 12:16 AM | Updated on Sep 5 2017 12:19 AM

గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు ఆడిన భారత మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ ఇప్పుడు అదే జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా

ముంబై: గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు ఆడిన భారత మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ ఇప్పుడు అదే జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ ఏడాది జరిగే పదో సీజన్‌కు అతను వసీమ్‌ అక్రమ్‌ స్థానంలో బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అతను ఈ ఫ్రాంచైజీకి 2011 నుంచి 2013 వరకు ప్రాతినిధ్యం వహించాడు.

ఆ సమయంలోనే (2012) కోల్‌కతా ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. తమిళనాడుకు చెందిన బాలాజీ గత సెప్టెంబర్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం తమిళనాడు జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement