కేకేఆర్‌ను కట్టడి చేశారు..

KKR lose track after Lynns fall - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 162 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(2) నిరాశ పరిచాడు. కాగా, మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది.అయితే ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన  నితీశ్‌ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్‌ ఊతప్ప గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు.

క్రిస్‌ లిన్‌ మాత్రం 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 82 పరుగులు సాధించిన తర్వాత నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎవరూ రాణించకపోడంతో కేకేఆర్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆండ్రీ రసెల్‌(10), దినేశ్‌ కార్తీక్‌(18), శుభ్‌మన్‌ గిల్‌(15)సైతం విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకుని కేకేఆర్‌ను కట్టడి చేశారు. కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఇమ్రాన్‌ తాహీర్‌ నాలుగు వికెట్లతో మెరవగా, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించాడు. సాంట్నార్‌కు వికెట్‌ దక్కింది. డుప్లెసిస్‌ నాలుగు క్యాచ్‌లు పట్టడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top