మీలో టాలెంట్‌ ఉందా..అయితే అప్లై చేయండి | Kirsten To Be On Talent Hunt From April 23 | Sakshi
Sakshi News home page

మీలో టాలెంట్‌ ఉందా..అయితే అప్లై చేయండి

Apr 23 2018 10:26 PM | Updated on Apr 23 2018 10:26 PM

Kirsten To Be On Talent Hunt From April 23  - Sakshi

టీం ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌(పాత చిత్రం)

ముంబాయి : మీలో టాలెంట్‌ దాగి ఉంటే అప్లై చేయండి. టీం ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరెస్టెన్‌ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్‌ స్కౌట్‌ కార్యక్రమం ప్రారంభించాడు. భారత్‌లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు. టాప్‌లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నాడు.

అలాగే టాప్‌లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్‌స్టెన్‌ క్రికెట్‌లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు. టాలెంట్‌ స్కౌట్‌ ఎంట్రీ ఫీజు రూ.1000. దీనిలో పాల్గొనేందుకు కేవలం టాలెంట్‌ మాత్రమే అర్హత. టాలెంట్‌ హంట్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు వారి పేరు, నగరం, కాంటాక్ట్‌ వివరాలు 9112295566 ఫోన్‌ నెంబర్‌కు వాట్సప్‌ చేయడమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement