శరణ్ అవుట్, శర్మ ఇన్ | Kings XI Punjab won the toss and opted to bat against Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

శరణ్ అవుట్, శర్మ ఇన్

May 15 2016 3:46 PM | Updated on Sep 4 2017 12:10 AM

శరణ్ అవుట్, శర్మ ఇన్

శరణ్ అవుట్, శర్మ ఇన్

ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 46వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.

మొహాలి: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 46వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించేలా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. మంచి స్కోరు సాధించి, కాపాడుకోవడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా చెప్పాడు. కేసీ కరియప్ప స్థానంలో అనురీత్ సింగ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

తాము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. మొత్తానికి తాము కోరుకున్నవిధంగా ముందుగా బౌలింగ్ దక్కిందని వెల్లడించాడు. సన్ రైజర్స్ టీమ్ రెండు మార్పులు జరిగాయి. కానే విలియమ్సన్, బరీందర్ శరణ్‌ స్థానంలో బెన్ కటింగ్, కర్ణ్‌ శర్మను తీసుకున్నారు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్ లో ఉండగా, పంజాబ్ ఏడో స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement