హషీమ్ ఆమ్లా దూకుడు | kings punjab set target of 180 runs | Sakshi
Sakshi News home page

హషీమ్ ఆమ్లా దూకుడు

May 15 2016 5:42 PM | Updated on Sep 4 2017 12:10 AM

హషీమ్ ఆమ్లా దూకుడు

హషీమ్ ఆమ్లా దూకుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అదరగొట్టాడు.

మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా  అదరగొట్టాడు. 56 బంతుల్లో 14 ఫోర్లు,2 సిక్సర్లతో చెలరేగి ఆడి 96 పరుగులు చేశాడు.  తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన ఆమ్లా ఆద్యంతం దూకుడుగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మురళీ విజయ్(6) నిరాశపరిచాడు.ఆ తరుణంలో ఆమ్లాకు జత కలిసిన సాహా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 54 పరుగులు జత చేసిన అనంతరం సాహా(27) పెవిలియన్ కు చేరాడు. అనంతరం గుర్ కీరత్ సింగ్(27), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. దీంతో పంజాబ్ 180 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచకల్గింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హెన్రీక్యూస్లకు తలో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement