
ఆర్సీబీ విజయలక్ష్యం 139
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 139 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శుక్రవారం ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 139 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(1), మార్టిన్ గప్టిల్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ 18 పరుగులకే పెవిలియన్ కు చేరడంతో కింగ్స్ పంజాబ్ కష్టాల్లో పడింది. అయితే షాన్ మార్ష్(20;17 బంతుల్లో 3 ఫోర్లు),మనన్ వోహ్రా(25;28 బంతుల్లో 1ఫోర్,1సిక్స్), వృద్ధిమాన్ సాహా(21;25 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించడంతో తిరిగి తేరుకుంది.
ఇక చివర్లో అక్షర్ పటేల్(38 నాటౌట్;17 బంతుల్లో3 ఫోర్లు,2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో అంకిత్ చౌదరి, చాహల్లు చెరో రెండు వికెట్లు సాధించగా, ఎస్ అరవింద్,షేన్ వాట్సన్, పవన్ నేగీలు తలో వికెట్ తీశారు.