రాహుల్‌ గెలిపించాడు.. | Kings Punjab beat Rajasthan Royals by 6 wickets | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గెలిపించాడు..

May 6 2018 11:31 PM | Updated on May 7 2018 7:46 AM

Kings Punjab beat Rajasthan Royals by 6 wickets - Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ విసిరిన 153 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ 18.4 ఓవర్లలో ఛేదించింది. దాంతో వరుసగా రెండు ఓటముల తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ విజయాన్ని అందుకుంది. కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ (84 నాటౌట్‌;54 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌(31), స్టోనిస్‌(23 నాటౌట్‌)లు ఆకట్టుకున్నారు.

అంతకుముందు రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రాజస్తాన్‌ ఆటగాళ్లలో జాస్‌ బట్లర్‌(51;39 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆ తర్వాత సంజూ శాంసన్‌(28;23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌(24‌)లు ఫర్వాలేదనిపించారు. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే డీ ఆర్సీ షార్ట్‌(2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్‌ బట్లర్‌కు కెప్టెన్‌ రహానే జత కలిశాడు. కాగా, రహానే(5) కూడా వైఫల్యం చెందడంతో రాజస్తాన్‌ 35 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్‌-శాంసన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్‌ ఔటయ్యాడు. అటు తర్వాత రాజస్తాన్‌ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో  కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, అక్షర్‌ పటేల్‌లకు తలో వికెట్‌ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement