సెమీస్‌లో శ్రీకాంత్‌కు షాక్‌ | Kidambi Srikanth Crashes out of Malaysia Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీకాంత్‌కు షాక్‌

Jun 30 2018 1:04 PM | Updated on Jun 30 2018 1:04 PM

Kidambi Srikanth Crashes out of Malaysia Open - Sakshi

కౌలాలంపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ‍్రీకాంత్‌ మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ప్రపంచ నాల్గో ర్యాంకర్‌ శ‍్రీకాంత్‌ 13-21, 13-21 తేడాతో ప్రపంచ 11వ ర్యాంకర్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో పరాజయం చెందాడు.

వరుస రెండు గేమ్‌లను మొమోటాకు సమర్పించుకున్న శ్రీకాంత్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న శ్రీకాంత్‌.. రెండో గేమ్‌లో సైతం ఘోరంగా వైఫల‍్యం చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement