
శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వెటరన్ పేసర్ లసింత్ మలింగను తప్పించారు. ఇంగ్లండ్‌లో మే 30 నుంచి జూలై 14 వరకు జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే శ్రీలంక బృందానికి టెస్టు జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె సారథ్యం వహిస్తాడు. మిగతా సభ్యులను నేడు ప్రకటిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
కరుణరత్నె చివరి వన్డేను 2015 ప్రపంచకప్‌లో ఆడటం గమనార్హం. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కరుణరత్నె కెప్టెన్సీలో శ్రీలంక 2–0తో నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది.