కరుణరత్నే సెంచరీ

Karunaratne century lifts Sri Lanka to 287 on tough day one - Sakshi

గాలె: ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే (222 బంతుల్లో 158 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ శతకంతో మెరిసినా...ఇతర బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌ తొలి రోజు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా బరిలోకి దిగి చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన నాలుగో శ్రీలంక బ్యాట్స్‌మన్‌గా కరుణరత్నే ఘనత సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 4 పరుగులకే ఒక వికెట్‌ కోల్పోయింది.  

చండిమాల్‌ ఔట్‌... 
గత నెలలో విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన చండిమాల్, కోచ్‌ చండిక హతురసింఘే, మేనేజర్‌ అశాంక గురుసిన్హా ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విండీస్‌తో టెస్టులో నిర్దేశిత సమయానికి మైదానంలోకి రాకుండా వీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడంపై ఐసీసీ విచారణ సాగుతోంది. ఐసీసీ తుది తీర్పు ఇవ్వకపోయినా, తాము తప్పు చేసినట్లు అంగీకరించి ఈ ముగ్గురు స్వచ్ఛందంగా సిరీస్‌కు దూరమయ్యారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top