క్రికెట్ దిగ్గజాలను సన్మానించనున్న కేఎస్సీఏ | Karnataka State Cricket Association to honour cricket legends in platinum jubilee year | Sakshi
Sakshi News home page

క్రికెట్ దిగ్గజాలను సన్మానించనున్న కేఎస్సీఏ

Aug 9 2013 7:19 PM | Updated on Sep 1 2017 9:45 PM

దేశంలో అత్యంత పురాతన క్రికెట్ సంఘాల్లో ఒకటయిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) పలువురు దిగ్గజ ఆటగాళ్లను సన్మానించనుంది.

దేశంలో అత్యంత పురాతన క్రికెట్ సంఘాల్లో ఒకటయిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) పలువురు దిగ్గజ ఆటగాళ్లను సన్మానించనుంది. కేఎస్సీఏ ప్లాటినమ్ జూబ్లీ ఏడాదిని పురస్కరించుకుని 8 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల17న  క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లను సముచితంగా గౌరవించనుంది.

చిన్నస్వామి మైదానంలో శనివారం కేఎస్సీఏ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ప్రారంభమవుతాయి. న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ సర్ రిచర్డ్ హెడ్లీ, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్దేవ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్లను సన్మానించనున్నట్టు కేఎస్సీఏ కోశాధికారి తాళ్లం వెంకటేష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement