జ్వాల జోడి శుభారంభం | Jwala Gutta-Ashwini Ponnappa enter second round of Korea Open Super Series | Sakshi
Sakshi News home page

జ్వాల జోడి శుభారంభం

Jan 9 2014 1:31 AM | Updated on Sep 2 2017 2:24 AM

బ్యాడ్మింటన్ సీజన్‌లోని తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి.

బ్యాడ్మింటన్ సీజన్‌లోని తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి.

బ్యాడ్మింటన్ సీజన్‌లోని తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి.

సియోల్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి... మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొనప్ప-తరుణ్ కోనా జంట శుభారంభం చేశాయి. అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)తో నెలకొన్న వివాదాలు పరిష్కారం కావడంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన జ్వాల తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. భాగస్వామి అశ్వినితో కలిసి జ్వాల కేవలం 19 నిమిషాల్లో 21-10, 21-7తో అనా రాన్‌కిన్-మెడిలిన్ స్టాపిల్‌టన్ (న్యూజిలాండ్) జోడిని చిత్తు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్విని-తరుణ్ జోడి 22-20, 21-17తో జోన్స్ ష్కోట్లెర్-జోనా గోలిస్‌జ్యూస్కీ (జర్మనీ) జంటపై గెలిచింది.

 పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 10-21, 11-21తో ఐదో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో; గురుసాయిదత్ 11-21, 11-21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. టాగోతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏదశలోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయాడు. రెండు గేముల్లోనూ ఆరంభదశలో తప్పించి మిగతా సమయాల్లో పూర్తిగా వెనుకబడ్డాడు. గురువారం జరిగే రెండో రౌండ్‌లో మూడో సీడ్ యె నా జాంగ్-సో యంగ్ కిమ్ (కొరియా) జోడితో జ్వాల-అశ్విని; మైకేల్ ఫచ్స్-బిర్గిట్ మిచెల్స్ (జర్మనీ) ద్వయంతో అశ్విని-తరుణ్ పోటీపడతారు. వచ్చే వారం జరిగే మలేసియా ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా కొరియా ఓపెన్‌లో సైనా, సింధు, కశ్యప్ బరిలోకి దిగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement