సెహ్వాగ్‌ రికార్డును సమం చేశాడు.. | Jos Buttler equalled Sehwag record to most consecutive half centuries in ipl | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌ రికార్డును సమం చేశాడు..

May 13 2018 11:16 PM | Updated on May 13 2018 11:16 PM

Jos Buttler equalled Sehwag record to most consecutive half centuries in ipl - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బట్లర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇది బట‍్లర్‌కు వరుసగా ఐదో హాఫ్‌ సెంచరీ. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా అత్యధిక అర్థ శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి బట్లర్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరపున సెహ్వాగ్‌ వరుసగా ఐదు అర్థ శతకాలు సాధించగా, ఆ రికార్డును తాజాగా బట్లర్‌ సమం చేశాడు.

ఈ ఐపీఎల్‌లో వరుసగా హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ అగ్రస్థానంలో ఉండగా, కేన్‌ విలియమ్సన్‌(4 హాఫ్‌ సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్‌ గేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌లు మూడు వరుస అర్థ శతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement